అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PF Withdrawal | పెన్షన్‌దారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees’ Provident Fund Organization) తన ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతోంది. ఖాతాదారులు సులువుగా డబ్బు చేసుకునే అవకాశాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఏటీఎంతో పాటు యూపీఐ (UPI) ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం కల్పించింది. ఈపీఎఫ్‌వో (EPFO) తీసుకొచ్చిన తాజా విధానం ఉద్యోగులు, కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుంది.
PF Withdrawal | ఈపీఎఫ్‌వో 3.0
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees Provident Fund Organization) తన సేవలను మరింత సులభతరం చేసింది. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుంచి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం (Cental Governament) EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించునుందుకు ఉద్దేశించిందే EPFO 3.0 పథకం. గతంలో ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా (Withdraw) చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. ఈపీఎఫ్‌వో కఠిన నిబంధనలకు తోడు పని చేసే సంస్థ నుంచి అనుమతులు వంటివి ఎన్నో అవరోధంగా మారేవి.
అయితే, ఇలాంటి కష్టాలు లేకుండా పీఎఫ్ ఖాతాదారు (PF account holders) సులువుగా డబ్బు డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఎప్పటికప్పుడు కొత్త విధానాలు ప్రవేశపెడుతోంది. తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి డబ్బును సులభంగా తీసుకొనేందుకు వీలుగా జూన్ 1 నుంచి ఈపీఎఫ్‌వో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఏటీఎం నుంచి, అలాగే యూపీఐ ద్వారా డబ్బును డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఇక నుంచి పీఎఫ్ చందాదారులు యూపీఐ, ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ సొమ్మును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మన బ్యాంకు ఖాతాలో (Bank Account) నుంచి తీసుకున్న మాదిరిగానే పీఎఫ్ ఖాతా నుంచి కూడా నేరుగా డబ్బులు ఏటీఎం కేంద్రాలతో పాటు గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్‌ల (UPI Apps) ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. లక్ష రూపాయల వరకు వెంటనే విత్‌డ్రా లేదా తాము కోరుకున్న బ్యాంక్ ఖాతాలకు (Bank Accounts) బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.