అక్షరటుడే, వెబ్డెస్క్: BC reservation | పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. హైకోర్టు జోక్యంతో అది కాస్త అటకెక్కింది.
దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకంగా కేబినెట్ నిర్ణయించింది. అది కూడా సరిపోదు.. బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం దాటాలని సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే ప్రకటించారు.
కానీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉంటోంది. అధికారికంగా కేటాయించాల్సిన స్థానాలను కూడా ఎగ్గొడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంగారెడ్డి గణాంకాలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.
BC reservation | 613 స్థానాలకు 117 చోట్లనే..
సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ జిల్లాకు చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా.. కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని, ఇది జీవో 46కు పూర్తిగా విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొనారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు కేసును రేపటికి వాయిదా వేసింది.