ePaper
More
    HomeజాతీయంPakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. రాజ‌స్థాన్‌లో ఒకరి అరెస్ట్

    Pakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. రాజ‌స్థాన్‌లో ఒకరి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Pakistan Spy | భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పాక్ గూడ‌చ‌ర్యంపై ప్య‌త్యేక దృష్టి సారించింది. పలువురు పాకిస్తాన్(Pakistan)కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయారు.

    ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra) సహా 10మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా పాకిస్థాన్​ గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్‌ పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డీగ్‌ ప్రాంతానికి చెందిన ఖాసిం(32) Khasim అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)ను చేపట్టింది. ఆ సమయంలో ఖాసీం పాకిస్థాన్​లోని​ కొంతమందితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పాక్​లో కూడా అతడు పర్యటించినట్లు తెలిసిందని పోలీసులు(Police) తెలియ‌జేశారు.

    Pakistan Spy | మ‌రో వ్య‌క్తి అరెస్ట్

    నిందితుడికి సంబంధించిన ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు మే 2న కూడా పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్‌(Pathan Khan) 12 ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు PAkistan తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం జైసల్మేర్‌కు చెందిన పఠాన్ ను అరెస్టు చేసింది. 2013 నుంచి భారతదేశ సరిహద్దు భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు.

    భారత్​- పాక్​ మధ్య పెరిగిన ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతా సంస్థలు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచాయి. ఈ క్రమంలోనే ఖాసిం పాకిస్థాన్​కు చేసిన కాల్స్​లో కొన్ని సంభాషణలు అనుమానాస్పందంగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కోసం ఖాసింను జైపుర్​కు Jaipur తరలించారు. ఇక ప‌ఠాన్ ఖాన్ 2013 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ (Pakistan Intelligence) అధికారులతో అతడు టచ్‌లో ఉన్నాడని వెల్లడించారు. మతపరమైన యాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు జైసల్మేర్‌ (Jaisalmer) సరిహద్దు ఫొటోలను ఆ దేశ అధికారులకు చేరవేశాడని తెలిపారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...