అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ 2 సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత వారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో రద్దయిన విషయం తెలిసిందే.
అఖండ 2 మూవీ టికెట్ రేట్ల పెంపునకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలోనే ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల (Ticket Rates) పెంపునకు జీవో విడుదల చేసింది. పెంచిన రేట్లలో 20శాతం కార్మికులకు ఇవ్వాలని పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో తాజాగా మరోసారి జీవో విడుదల చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. రేపు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో (Premiere show) వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో ధర రూ.600గా నిర్ణయించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 14 వరకు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి.
Akhanda 2 | ఫ్యాన్స్‌లో జోష్
బాలయ్య సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గత వారం విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడటంతో బాలకృష్ణ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలో తాజాగా మూవీ విడుదల కానుండటంతో హంగామా చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, ఈరోస్ (Eros) సంస్థల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే సమస్య పరిష్కారం కావడంతో శుక్రవారం సినిమా విడుదల చేస్తామని మంగళవారం రాత్రి చిత్ర బృందం ప్రకటించింది.