అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్నందున స్థానిక రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల (police officers) అనుమతి తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రతి రాజకీయ పార్టీ, అభ్యర్థులు, నిర్వాహకులు నియమాలను పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు (police department) సహకరించాలని కోరారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో అందరి భాగస్వామ్యo అవసరమని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad CP | పరీక్షల సందర్భంగా ఆంక్షలు అమలు
జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (Diploma in Elementary Education) పరీక్షలు జరుగనున్నందున పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Nizamabad CP | పరీక్ష కేంద్రాల వద్ద..
పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని సూచించారు. పరీక్షా కేంద్రం, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను వచ్చేనెల 1వ తేదీ నుంచి 6 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసి ఉంచాలన్నారు.