Homeతాజావార్తలుCM Revanth Reddy | భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : సీఎం రేవంత్​రెడ్డి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ చట్టం పక్కాగా అమలు కావడానికి లైసెన్స్​డ్​ సర్వేయర్లు (licensed surveyors) పని చేయాలని సూచించారు.

శిక్షణ పొందిన సర్వేయర్లకు సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3,465 మంది లైసెన్స్​డ్ సర్వేయర్లను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమి కోసం ఎన్నో యుద్ధాలు, పోరాటాలు జరిగాయాన్నారు. భూమి కోసం పోరాడిన పోరాడిన చాకలి ఐలమ్మ (Chakali Ailamma) తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు.

CM Revanth Reddy | ధరణి కొందరికి చుట్టం

బీఆర్​ఎస్​ హయాంలో తెచ్చిన ధరణి చట్టం (Dharani ACT) కొందరికి చుట్టం అయిందని రేవంత్​రెడ్డి విమర్శించారు. కొందరు దొరలు ఈ చట్టం పేరుతో భూములు పొందాలని చూశారన్నారు. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ధరణి చట్టం వచ్చాక రైతుల భూ సమస్యలు పరిష్కారం కాక.. ఏళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిరిగారన్నారు. దీంతో తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని తొలగించి భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చినట్లు చెప్పారు.

CM Revanth Reddy | రైతుల కోసం పని చేయాలి

కాంగ్రెస్​ రైతుల (Farmers) కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం అన్నారు. 2006లో 10 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు కాంగ్రెస్​ హయాంలో పంపిణీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. తాజాగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని భూ భారతి చట్టం తెచ్చామన్నారు. ఇందుకోసమే లైసెన్స్​డ్​ సర్వేయర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు వెల్లడించారు. సర్వేయర్లు పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. రైతు రాజు కావాలంటే సర్వేయర్లు కష్టపడి పని చేయాలన్నారు. పనిలో నిజాయితీ ఉండాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన వాళ్లం అవుతామని ఆయన పేర్కొన్నారు.