అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు (Sub-registrar offices) తెలంగాణలో రిజిస్ట్రేషన్ (Registration) సేవలను మార్చి వేస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం ఆయన సమాధానం చెప్పారు.
రాష్ట్రంలో 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వాటిలో 94 అద్దె భవనాల్లో, 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం మూడు దశల్లో శాశ్వత భవనాలను నిర్మిస్తామన్నారు.
Minister Ponguleti | 39 ఆఫీసులు..
మొదటి దశలో హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత క్లస్టర్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆదాయంలో వీటి నుంచే 69 శాతం వాటా వస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ ఆధునిక, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు లేకుండా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మొదటి ఐదేళ్ల పాటు ప్రైవేట్ డెవలపర్లు నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటారన్నారు.
స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానం ప్రవేశపెట్టడంతో ప్రతి పత్రానికి రిజిస్ట్రేషన్ సమయం 18-21 నిమిషాలకు తగ్గిందన్నారు. ఇది ప్రజలకు వేగవంతమైన, ఇబ్బందులు లేని సేవలను అందిస్తుందని మంత్రి వెల్లడించారు.