అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీసు అధికారులు ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో (district police office) జిల్లా ఎస్పీ, అధికారులు, పోలీస్ సిబ్బంది సమక్షంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు (New Year celebrations) నిర్వహించారు.
SP Rajesh Chandra | సరికొత్త ఆలోచనలు.. ఆధునిక పరిజ్ఞానంతో..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. గతేడాదిలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలను, 64 మరణాలను తగ్గించగలిగామన్నారు. ఇతర రాష్ట్రాల గ్యాంగ్‌లను పట్టుకొని వారిని జైలుకు పంపడమే కాకుండా వారిపై పీడీ యాక్టు (PD Act cases) కూడా నమోదు చేశామని తెలిపారు.
SP Rajesh Chandra | వర్ష విపత్తు సమయంలో..
వర్ష విపత్తు సమయంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు సమయస్పూర్తి, సమన్వయంతో పనిచేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసుశాఖలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని ప్రదర్శించి దేశ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నామన్నారు. ఇకపై కూడా జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువగా ఉండి, సమన్వయం, సమగ్రతతో విధులు నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు.
SP Rajesh Chandra | నేరాల నియంత్రణలో..
నేరాల నియంత్రణ (crime control), రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జిల్లాను శాంతియుతంగా నిలబెట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పోలీస్‌బాస్ తెలిపారు. విధుల నిర్వహణలో సిబ్బంది ఒక కుటుంబంలా ఐక్యతతో, కృషి, కమిట్మెంట్తో పనిచేయాలని సిబ్బందిని ఉత్సాహపరిచారు.
SP Rajesh Chandra | కిడ్స్ విత్ ఖాకీ కార్యక్రమం ద్వారా..
కిడ్స్ విత్ ఖాకీ (Kids with Khaki) అనే కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున.. ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు రోడ్డు భద్రత, పోలీసు విధులు, చట్టాలపై మరింత అవగాహన తీసుకువస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.