95
అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఓటేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) సూచించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
Shabbir Ali | పారదర్శకంగా గ్రామాభివృద్ధి..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గెలిచిన సర్పంచులపై గ్రామస్థులు ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన పాలనే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.