అక్షరటుడే, కామారెడ్డి : Prashanth Reddy | రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి mla vemula prashanth reddy అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ gampa goverdhan నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ kcr అలుపెరుగని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందన్నారు. తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని అన్నారు. ఈ నెల 27 న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ brs sabha warangal సభకు ఉమ్మడి జిల్లా నుంచి 2,400 వాహనాల్లో 40 వేల మంది బయలు దేరనున్నారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ brs president mujibuddin, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే hanmanth shinde, జాజాల సురేందర్ jajula surendar పాల్గొన్నారు.