Ex Mla Jeevan Reddy
Ex Mla Jeevan Reddy | అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలి

అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆర్మూర్​ మీదుగా కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి (Congress state affairs in-charge) మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కానీ హామీలపై ప్రజలు ఎండగట్టాలన్నారు.

Ex Mla Jeevan Reddy | ప్రజలను మోసం చేశారు..

హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్​ పార్టీ మోసం చేసిందని జీవన్​రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​పార్టీ ప్రజల కోసం చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన ఆరు గ్యారెంటీల అంతిమ యాత్ర అని ఆయన వెల్లడించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓట్లడిగే హక్కు లేదన్నారు. పాదయాత్రలో కాంగ్రెస్ మోసాలపై ప్రజలంతా తిరగబడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.