అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | రాజ్యాంగ విధులు ప్రజాస్వామ్యానికి పునాది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన దేశ ప్రజలకు లేఖ రాశారు. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన రోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మోదీ (Modi) లేఖ రాశారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోందన్నారు. దేశ పౌరులు తమ విధుల నిర్వహణకు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దోహద పడాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోదీ సూచించారు.
PM Modi | విధులు నిర్వహించడం..
ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు 18 ఏళ్లు నిండిన మొదటిసారి ఓటు వేసిన వారిని గౌరవించడం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. కర్తవ్యాల నిర్వహణ నుంచి హక్కులు ప్రవహిస్తాయని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) నమ్మకాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. విధులను నిర్వర్తించడం సామాజిక, ఆర్థిక పురోగతికి పునాది అని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రాముఖ్యతను ఇస్తుందని చెప్పారు. ఇది మనకు హక్కులతో సాధికారత కల్పిస్తున్నప్పటికీ.. పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆయన నివాళులు అర్పించారు.
