HomeతెలంగాణBodhan MLA | వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి

Bodhan MLA | వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి

- Advertisement -

అక్షర టుడే, బోధన్: Bodhan MLA | వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) మున్సిపల్ అధికారులను (municipal officials) ఆదేశించారు.

పట్టణంలోని పలు వార్డుల్లోని లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. వర్షపు నీరు ఆగకుండా డ్రైనేజీలు (drainages) నిర్మించాలని సూచించారు. ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయించి మొరం వేయించాలని యజమానులకు సూచించాలని అధికారులకు చెప్పారు. వేంకటేశ్వర కాలనీలోని బతుకమ్మ కుంట బస్టాండ్ వెనుక వైపు ఉన్న నల్ల పోచమ్మ ఆలయం వద్ద వద్ద గల రోడ్లను, చెక్కన్న చౌరస్తా వద్ద గల డ్రైనేజీలను (drainages) పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ వెంకట్ నారాయణ, ఏఈ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Must Read
Related News