అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jukkal MLA | భారీ వర్షాలతో ( heavy rains ) ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantarao) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా మద్నూర్ మండలం (Madnoor Mandal) చిన్న ఎక్లారా గ్రామంలో చెక్‌డ్యాంకు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపునకు గురైంది.
దీంతో శనివారం సాయంత్రం నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS government) నాసిరకం పనులతో నిర్మించిన చెక్‌డ్యాం నాణ్యత లోపించి దెబ్బతినడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. చెక్ డ్యాం (check dam), కెనాల్స్‌ను పునర్నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు చెప్పారు.
అధికారుల బృందం నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందేలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.