ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector kamareddy | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​

    Collector kamareddy | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Collector kamareddy | జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రజలకు సూచించారు. పాల్వంచ మండలంలోని భవానీపేట్ (Bhavanipet) నుండి పోతారం (potharam) వెళ్లే దారిలో భావానీపేట్ వాగు ఉధృతిని అదనపు కలెక్టర్ విక్టర్​తో కలిసి పరిశీలించారు.

    నీటి ఉధృతి అధికంగా ఉన్నందున నీటి ప్రవాహం వంతెన కంటే ఒక ఫీట్ వరకు రాకముందే ఈ దారిలో వాహనాలను నిలిపివేయాలని ఆర్అండ్​బీ ఈఈ మోహన్, డీఈలను ఆదేశించారు. జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

    జిల్లా కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్ష సూచికలు తీసుకొని గ్రామాల వాట్సాప్ గ్రూపులు, దండోరా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...