Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

Sub collector Kiranmai | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Sub collector Kiranmai | రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub collector Kiranmai) తెలిపారు.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో (Sub Collector Office) బుధవారం డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల్ని, యువకులను ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కోరారు.

అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవాలన్నారు. ప్రజలు వాగుల్లో, చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్లవద్దని చెప్పారు. గేదెల కాపర్లు జాగ్రతగా ఉండాలన్నారు. భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన సమయంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని చెప్పారు.