అక్షరటుడే, బోధన్: Nizamabad CP | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వంతెనను (Kandakurti bridge) శుక్రవారం ఆయన పరిశీలించారు.
రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోలెవెల్ వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఎగువ ఉన్న మహారాష్ట్ర నుంచి భారీగా వరద (heavy floods) వస్తున్నందున కందకుర్తి వంతెనను ఆనుకుని వరద ప్రవహిస్తోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి, విష్ణుపురి నుంచి సైతం భారీగా వరద వస్తున్నందున స్థానిక ప్రజలు అలర్ట్గా ఉండాలని పేర్కొన్నారు.
అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ (Renjal police station)కు గాని.. డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ సంతోష్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, తహశీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.