HomeతెలంగాణHeavy Rains | భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం ఉండాలి

Heavy Rains | భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం ఉండాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Heavy Rains | భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఆలూర్ మండల (Aloor Mandal) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న సమయంలో వాటి వద్దకు వెళ్లవద్దని సూచించారు.

వ్యవసాయ పనుల (agricultural work) కోసం పొలాలకు వెళ్లే రైతులు (Farmers) తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పడిపోయిన విద్యుత్ తీగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కావద్దని హెచ్చరించారు. పాత కట్టడాలు, పాడుబడిన గోడలు వర్షాల తాకిడితో కూలిపోవచ్చన్నారు. అలాంటి సందర్భాల్లో వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మండలంలోని అని గ్రామ పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వసతి కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో తగిన సౌకర్యాలు కల్పించినట్లు ఎంపీడీవో తెలిపారు.

Must Read
Related News