ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    CP Sai Chaitanya | వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: CP Sai Chaitanya | రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

    ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని.. ప్రజల భద్రతా దృష్ట్యా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

    CP Sai Chaitanya | అనవసరంగా బయటకు రావొద్దు..

    భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సీపీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్​తీగలు కింద పడ్డట్లయితే వాటిని గమనించి దూరంగా ఉండాలని హెచ్చరించారు. గణేష్ మండలి (Ganesh Mandals) నిర్వాహకులు మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లవద్దని పేర్కొన్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

    వ్యవసాయ పనుల (Agricultural work) నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీస్​ కమిషనర్​ సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్తు తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

    పురాతన కట్టడాలు (Ancient buildings) లేదా పురాతనమైన ఇళ్లు, గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా వరద ఉధృతి ఉంటే పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీ పేర్కొన్నారు. ప్రాణనష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

    వినాయక విగ్రహం ప్రతిష్ఠించిన చోటా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ వివరించారు. రెవెన్యూ , మున్సిపల్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

    Latest articles

    Family Benefit Card | ప్రతి కుటుంబానికి ..ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్.. సంక్షేమ పథకాలపై చంద్రబాబు కీల‌క నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Family Benefit Card | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం నూతన పథకాల అమలుకు కీలక...

    Gandhari Police | వాగులో కొట్టుకుపోతున్న మహిళ.. కాపాడిన ఎస్సై

    అక్షరటుడే/గాంధారి: Gandhari Police | వాగులో కొట్టుకుపోతున్న ఓ మహిళను ఎస్సై అతికష్టం మీద కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.....

    Heavy Rains | కామారెడ్డికి సీఎం రేవంత్​ రెడ్డి.. వరద ప్రభావంపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి

    అక్షరటుడే, కామారెడ్డి​ : Heavy Rains | కామారెడ్డి జిల్లాను అతి భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఒక్క...

    Schools holiday | భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Schools holiday | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు(Heavy Rains) తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి...

    More like this