Homeతాజావార్తలుPCC Chief | జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు: పీసీసీ చీఫ్​

PCC Chief | జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు: పీసీసీ చీఫ్​

ప్రజా​ ప్రభుత్వం చేస్తున్న​ అభివృద్దిని చూసి ప్రజలు జూబ్లీహిల్స్​లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించారని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు. ఈ మేరకు నిజామాబాద్​ నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ : PCC Chief | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా​ ప్రభుత్వం చేస్తున్న​ అభివృద్దిని చూసి ప్రజలు జూబ్లీహిల్స్​లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించారని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ (PCC Chief Mahesh Kumar) గౌడ్​ అన్నారు.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్​ గెలుపుపై ఆయన శుక్రవారం నగరంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రణాళిక ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్​ ఛైర్మన్లు పార్టీ కార్యకర్తలు అంతా కలిసి ఉపఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు.

PCC Chief | మరో మెట్రో, మూసినది సుందరీకరణ..

ముఖ్యంగా హైదరాబాద్​లో (Hyderabad) మరో మెట్రో రైలు​మార్గం, మూసీ సుందరీకరణ పనులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు కాంగ్రెస్​ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు రెండు సందేశాలిచ్చారని.. కాంగ్రెస్​ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారని.. అలాగే వచ్చే ఎన్నికల్లోనూ వందకుపైగా సీట్లను గెలుస్తామనే ధీమా తమకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​కు మనుగడ లేదు

బీఆర్​ఎస్​కు (BRS) మనుగడ లేదని తాజా తీర్పుతో స్పష్టమైందని మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. జూబ్లీహిల్స్​లో గెలుపుతో బీఆర్​ఎస్​కు స్థానం లేదని ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన బీఆర్​ఎస్​ నాయకుల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు.

PCC Chief | వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తాం..

వచ్చే మూడేళ్లలోనూ జనరంజక పాలన అందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని పీసీసీ చీఫ్​ ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లు ప్రజల కోసమే పాలన సాగించామని.. వచ్చే మూడేళ్లు సైతం ప్రజారంజక పాలన అందిస్తూ వచ్చే మరో సారి భారీ మెజారిటీతో అధికారం నిలబెట్టుకుంటామన్నారు.

PCC Chief | బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం..

బీసీ రిజర్వేషన్లను (BC Reservations) ఎట్టిపరిస్థితుల్లో సాధిస్తామని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. అందుకే బీసీ బిడ్డ నవీన్​యాదవ్​ను నిలబెట్టామన్నారు. తమ నాయకుడు రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు ఖర్గే ఆశయాలను సాధిస్తూ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తి చెంది భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు.

PCC Chief | ప్రజలు స్పష్టమైన మద్దతునిచ్చారు..

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చారని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు చెంపపెట్టు వంటి తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ విజయం జీహెచ్​​ఎంసీ ఎన్నికలకు (GHMC Elections) నాంది పలుకుతూ, రానున్న జీహెచ్​​ఎంసీ (GHMC) ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

PCC Chief | ఈ విజయం ప్రతి కార్యకర్తకు అంకితం..

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త చెమటోడ్చి కష్టపడ్డారని బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు. గెలుపు కోసం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ప్రతికార్యకర్త గెలుపు కోసం కృషి చేశారన్నారు. ఈ విజయం వారికే అంకితమిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

PCC Chief | రేవంత్​రెడ్డికి శుభాకాంక్షలు..

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లామని.. అందుకే విజయం తమ సొంతమైందని పీసీసీ చీఫ్​ అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Deputy CM Bhatti Vikramarka) శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీ, ఎమ్మల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి, నుడా ఛైర్మన్​ కేశ వేణు, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News