అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Road Safety week | ప్రజలంతా రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని సీపీ కార్యాలయంలో గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు.
Road Safety week | రోడ్‌సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో
జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ (District Road Safety Committee) ఆధ్వర్యంలో భాగంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి దుర్గాప్రమీల ఆధ్వర్యంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా రోడ్డు భద్రత నియమాలను పక్కాగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
Road Safety week | జనవరి 1వ తేదీ నుంచి..
జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రాం చందర్ రావు, ఉమామహేశ్వరరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు బి. శ్రీనివాస్, కిరణ్ కుమార్, నాగలక్ష్మి, అజయ్ కుమార్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సీఐ ప్రసాద్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.