అక్షరటుడే, భీమ్గల్: Sriramsagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు దిగువన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలపై ఇరిగేషన్ అధికారులను (Irrigation Department) అడిగి తెలుసుకున్నారు. పశువులు, గొర్ల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు అలాగే సామాన్య ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితి ఏర్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి ఎక్కువ అవుతున్న సందర్భంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి (ACP Venkateswara Reddy), ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని సిబ్బంది తదితరులున్నారు.