అక్షరటుడే, కమ్మర్పల్లి : Balkonda Congress | కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పలువురు కార్యకర్తలు చేరుతున్నారని బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌రెడ్డి అన్నారు. కమ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన మున్నూరుకాపు సంఘం సభ్యులు ఆదివారం సునీల్‌రెడ్డి (Sunil Reddy) ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముందుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంకెట రవి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న, పడాల నడిపి గంగాధర్, సింగిరెడ్డి శేఖర్, ఊట్నూర్ ప్రదీప్, ఆల్గోట్ రంజిత్, వేములవాడ జగదీష్, వెల్మల రాందాస్, వెల్మల పెద్ద సాయన్న, ఆదె గణేష్, ఆదె మోహన్, కిషన్, ఆదె గంగాధర్, దులూర్ కిషన్, పాలెపు చిన్న గంగారాం తదితరులు పాల్గొన్నారు.