HomeUncategorizedRanchi | భారీ వర్షంలోను వీఐపి కాన్వాయ్‌ కోసం ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి.. వెల్లువెత్తుతున్న...

Ranchi | భారీ వర్షంలోను వీఐపి కాన్వాయ్‌ కోసం ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి.. వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ranchi | జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో భారీ వర్షం(Heavy Rain) కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావ‌ల‌సి వ‌చ్చింది. వీఐపీ కాన్వాయ్(VIP convoy) కోసం ప్రజలు వర్షంలో నిలబడి తమ ప్రయాణం కొనసాగించ‌కుండా తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ఘటన రాంచీ నగరంలోని ప్రధాన వీధుల్లో చోటుచేసుకుంది. రాంచీ(Ranchi) నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, వీఐపీ కాన్వాయ్ కోసం కొన్ని ముఖ్య‌మైన‌ రహదారులను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వీఐపీలు ప్రయాణం చేస్తున్న సమయంలో సాధారణ ప్రజలని నిలిపివేయడం వలన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Ranchi | ఇదేమ‌న్నా బాగుందా..

కాన్వాయ్ వెళ్లిపోయే వ‌ర‌కు ప్రజలు వర్షంలో నిలబడి గంటలు పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏంట‌ని కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీఐపి కాన్వాయ్ కోసం సామాన్య ప్ర‌జ‌ల‌ని ఆప‌డం వ‌ల‌న వారి పనులు, ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయ‌ని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై నగరంలోని పలువురు ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎవ‌రి కోస‌మో వర్షంలో అంత సేపు నిలబడి ఉండటం ఎంత బాధాకరమైన విషయం అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇంతవరకు, ప్రభుత్వ వైపు నుండి ఈ విషయంలో సరైన స్పందన లేదు. ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి వివ‌ర‌ణ ఉండ‌దు.

గతేడాది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు(CM Chandra Babu) తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని.. ఎక్కువసేపు ట్రాఫిక్ నిలిపివేయొద్దని అధికారులకు సూచించి అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు. చంద్రబాబు ప్రతిరోజూ గుంటూరు జిల్లాలోని ఉండవల్లి నివాసం నుంచి సచివాలయంతో పాటుగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడతో పాటూ విమానాశ్రయం వరకు వెళుతుంటారు. పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో రెండు వైపులా 36 స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఏఐ ఆధారంగా పనిచేసేలా సెట్ చేశారు.. వీటిని విజయవాడలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో లింక్ చేశారు.ఈ కొత్త వ్యవస్థ సాయంతో ట్రాఫిక్ నిలిపివేత పది నిమిషాల సమయం కాకుండా ఐదు నిమిషాలే ఉంటోంది.

Must Read
Related News