అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) ప్రజలు నమ్మడం లేదని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఓట్ చోరీపై ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం దాదాపుగా కనుమరుగైందన్నారు. మోదీ ముఖంలోనే ఆయన విశ్వాసం ఇకపై లేదని వెల్లడిస్తుందని అన్నారు. ఓటు దొంగతనం చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు బయటపడ్డాయన్నారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. సత్యానికి, అబద్ధానికి మధ్య జరిగే ఈ యుద్ధంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లను రక్షించడానికి మోదీ చట్టాన్ని మార్చారన్నారు. వారు ఏమి చేసినా వారిపై ఎటువంటి చర్య తీసుకోవడం సాధ్యం కాదన్నారు.
Rahul Gandhi | అమిత్షా చేతులు వణికాయి
పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) చేతులు వణకడం తాను చూశానని రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా ధైర్యం అధికారానికే పరిమితం అన్నారు. ఆయన అధికారం కోల్పోయిన రోజు ధైర్యం కూడా ముగుస్తుందని వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం సత్యం, అసత్యానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ సత్యం వైపు నిలుస్తుందని చెప్పారు.
Rahul Gandhi | చట్టాన్ని మారుస్తాం
కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ను (Election Commission) తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ చేశారని, ఓట్లు చోరీ చేశారన్నారు. ప్రధాని మోదీ చట్టాన్ని మార్చడం ద్వారా ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని మారుస్తామన్నారు. బాధ్యులపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.