అక్షరటుడే, బోధన్: GP Bill Collector suicide | బోధన్ మండలంలో పెంటకుర్దు గ్రామంలో జీపీ బిల్కలెక్టర్గా పనిచేస్తున్న నీరుడి బాబు(38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 5వ తేదీన బాబు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి (Bodhan Government Hospital) తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) తరలించగా అక్కడ చికిత్సపొందుతూ 6వ తేదీ రాత్రి మృతి చెందాడు. కాగా బాబు స్వగ్రామం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల పోచారం.
GP Bill Collector suicide | పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు..
తన భర్త బాబు ఆత్మహత్య చేసుకోవడానికి పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) వేధింపులే కారణమని భార్య కవిత ఆరోపించారు. గతకొంతకాలంగా బిల్లుల వసూళ్ల పేరుతో పంచాయతీ కార్యదర్శి తన భర్తను నిత్యం వేధించేవాడన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసినప్పటికీ లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. ఈ విషయమై తన భర్త పురుగుల మందు తాగే ముందు ఉత్తరం కూడా రాశాడని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ నారాయణ (CI Venkat Narayana) తెలిపారు.