ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP CM | భూమిలేని పేద‌ల‌కు పెన్ష‌న్.. 1,575 పేద కుటుంబాలకు పునరుద్ధరణ

    AP CM | భూమిలేని పేద‌ల‌కు పెన్ష‌న్.. 1,575 పేద కుటుంబాలకు పునరుద్ధరణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: AP CM | ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra babu) అధ్యక్షతన తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలో 19 అజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం ల‌భించింది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులను కూడా​ మంజూరు చేసింది.

    రాజధాని అమరావతి (AP Capital Amaravati) పరిధిలో భూమి లేని దాదాపు 1,575 పేద కుటుంబాలకు పెండింగ్​లో ఉన్న పెన్షన్​ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణ నది నుంచి డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు సీఆర్‌డీఏకు మంత్రిమండలి అనుమతి ఇచ్చింది.

    AP CM | గుడ్​న్యూస్..

    జలవనరుల శాఖలో (Water Resources Department) 71 పనులకు ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది.

    కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు (Amaravati airports) హడ్కో కింద వెయ్యి కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ రుణానికి మంత్రివర్గం ఆమోదం లభించింది. హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    ఏపీ జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ బిల్లులో (Anhra Pradesh Motor Vehicle Bill) పలు చట్ట సవరణలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, కార్మిక బిల్లులో పలు చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది.

    అనకాపల్లి జిల్లా (Anakapalli district) నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటుకు అదనంగా 790 ఎకరాలు సేకరించేందుకు ఆమోదం తెలిపింది. అలానే ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 2025-30కు ఆమోదం, నెల్లూరు జిల్లాలో పెట్రో కెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణ, 6 యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం, కోకో రైతులను ఆదుకునేందుకు రూ.14.88 కోట్ల మంజూరు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు శుభవార్త.. గతంలో నిలిచిపోయిన పెన్షన్లు తిరిగి పునరుద్ధరించనున్నారు. మొత్తం 1,575 పేద కుటుంబాలకు పెన్షన్ మళ్లీ మంజూరయ్యింది. 2015లో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా ఈ పెన్షన్లు అప్పట్లో మంజూరయ్యాయి.

    అయితే పలు కారణాల వల్ల కొన్ని కుటుంబాలకు పెన్షన్ పంపిణీ నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భూమిలేని, నిరుపేద కుటుంబాలు మళ్లీ ప్రభుత్వ పింఛన్ సంక్షేమానికి అర్హులుగా గుర్తించబడ్డారు. త్వరలోనే వారికి సంబంధిత అధికారుల ద్వారా పెన్షన్ లబ్ధి కొనసాగనుంది.

    More like this

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...