అక్షరటుడే, బాన్సువాడ : Collector Nizamabad | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. వర్ని తహశీల్దార్ కార్యాలయాన్ని(Tahsildar Office) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూభారతి(Bhubharati) అమలుపై సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఏ మాడ్యూల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించబడ్డాయి..? ఇంకా పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయనే విషయాలను సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఎంత మందికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు.
Collector Nizamabad | రెండునెలలుగా పెండింగ్‌లో ఉండడంపై..
దరఖాస్తుల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం చోటు చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతోపై కలెక్టర్‌గా ఆగ్రహించారు. నిర్దిష్ట గడువులోపే అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని, తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.సాదా బైనామాలు, పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నోటీసులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోజువారీగా సమీక్ష నిర్వహిస్తూ వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.