అక్షరటుడే, కామారెడ్డి: PDSU | నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (fee reimbursement), స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) ఎదుట మంగళవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు.
ఉన్నత చదువులకు (higher education) పేద, మధ్య తరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు, కోర్సు ఫీజు పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ, మైనార్టీ విద్యార్థుల మాదిరిగా ఎస్సీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు కళాశాల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సాయి కిరణ్, నాందేవ్, సతీష్, చరణ్ తదితదిరులు పాల్గొన్నారు.

