Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయాలి: ఎస్పీ రాజేష్​ చంద్ర

SP Rajesh Chandra | పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయాలి: ఎస్పీ రాజేష్​ చంద్ర

పెండింగ్​ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం క్రైం రివ్యూ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో పెండింగ్​లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో (Kamareddy Police) శుక్రవారం నెలవారీ నేర సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పూర్తి పారదర్శక దర్యాప్తు జరగాలన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు.

పాత, కొత్త కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే దిశగా పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర న్యాయం అందించాలని సూచించారు. రౌడీలు, అనుమానితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలతో కట్టడి చేయాలని సూచించారు.

ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలను కఠిన చర్యలతో రూపుమాపాలని ఆదేశించారు. ఫేక్ నంబర్ ప్లేట్లు, నెంబర్ ప్లేట్ల మార్పులపై క్షుణ్ణంగా తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతూ రోడ్ సేఫ్టీ కమిటీ (Road Safety), సంబంధిత శాఖలతో కలిసి ప్రమాద స్థలాలను పరిశీలించి తగిన భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.

డ్రంకన్​ డ్రైవ్ (Drunk drive)​ టెస్ట్​లు నిర్వహిస్తూ రోడ్డు భద్రతను పెంపొందించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి సమయాల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది నిరంతర పహారా నిర్వహించాలని ఆదేశించారు. నాన్​ బెయిలబుల్​ వారెంట్లు (Non bailable warrants) సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. ఎఫ్‌ఐఆర్, సీడీఎఫ్, పార్ట్-1, పార్ట్-2, రిమాండ్ డైరీ, చార్జ్‌షీట్, సీసీ నంబర్ వంటి అన్ని వివరాలను రోజువారీగా అప్డేట్ చేయడం ద్వారా పారదర్శకత, సమర్థతను నిర్ధారించాలన్నారు.