అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pencil Stuck Private Part : జైలులో ఉన్న ఓ ఖైదీ ప్రైవేటు పార్టులో పెన్సిల్ ఇరుక్కుపోయింది. దాని సైజు వింటే షాక్ అవుతారు.
ఎందుకంటే అది 9 సెంటీమీటర్లు ఉంది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్ Chhattisgarh లోని అంబికాపూర్ సెంట్రల్ జైలులో వెలుగుచూసింది.
జైలు JAIL లోని ఖైదీ మూత్రనాళంలో పెన్సిల్ ఇరుక్కుందని తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు. వెంటనే సదరు ఖైదీని అంబికాపూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానాకు తీసుకెళ్లారు.
ఎక్స్ రే తీయగా.. ఆ పెన్సిల్ సైజు 9 సెంటీ మీటర్ల వరకు పొడవుందని తేలింది. ఈ పెన్సిల్ వల్లే బాధిత ఖైదీ మూత్ర విసర్జన సరిగా చేయలేకపోతున్నట్లు గుర్తించారు. తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతున్నట్లు నిర్ధారించారు.
ఆపరేషన్ విభాగ అధిపతి డా. ఎస్పీ కుజుర్, అనస్తీషియా Anaesthetist వైద్యుడు శివమ్, డా. ప్రవీణ్ సింగ్, డా. కాంతా, డా. ఇంద్రానీల్, ఇతర వైద్యులు కలిసి సుమారు 3-4 గంటలపాటు శ్రమించారు.
మొత్తానికి శస్త్రచికిత్స ద్వారా పెన్సిల్‌ను తొలగించారు. అలా బతుకు జీవుడా అంటూ ఖైదీ ప్రాణాలతో బయటకొచ్చాడు. ఖైదీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
Pencil Stuck Private Part | పలు అనుమానాలు
అంబికాపూర్ Ambikapur సెంట్రల్ జైలు Central Jail లో ఓ ఖైదీ వద్ద పెన్సిల్ బయట పడిన నేపథ్యంలో కారాగారం భద్రతా వ్యవస్థపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ పెన్సిల్‌తో ఏదైనా నేరం చేస్తే.. పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖైదీల వద్ద ఇలాంటి వస్తువులు దొరకడం ఇది మొదటిసారేం కాదు. గతంలో ఖైదీల వద్ద మొబైల్, గంజాయి కూడా లభించాయి.