Homeజిల్లాలునిజామాబాద్​Dharpally Mandal | భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

Dharpally Mandal | భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

ధర్పల్లి మండలంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పెద్దమ్మతల్లిని శుక్రవారం మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ దర్శించుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి: Dharpally Mandal | మండలంలోని దుబ్బాక గ్రామంలో (Dubbaka village) శుక్రవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మూడు రోజులుగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాలను పురస్కరించుకొని పెద్దమ్మతల్లి ఆలయ (Peddamma Thalli temple) సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారాల మధ్య యజ్ఞం, హోమం జరిపించారు. వేద పండితుల ఆధ్వర్యంలో పెద్దరాజు పెద్దమ్మతల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా మూడు రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.