అక్షరటుడే, బాన్సువాడ: Fisheries Cooperative Society | కామారెడ్డి(kamareddy) జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (Fisheries Cooperative Society Limited) అధ్యక్షుడిగా పసుపుల పెద్ద సాయిలు నియమితులయ్యారు.
బాన్సువాడ (Banswada) మండలంలోని సోమేశ్వర్ ప్రాథమిక మత్స్యకార సహకార సంఘానికి చెందిన ఆయన ఇప్పటి వరకు జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.
లింగంపేట్ (Lingampet) మండలంలోని మోతె ప్రాథమిక మత్స్యకార సహకార సంఘానికి చెందిన సత్యనారాయణ అనర్హత కారణంగా జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఈ నియామకం చేపట్టారు. తెలంగాణ కోఆపరేటివ్ చట్టం 1964లోని సెక్షన్ 32-B ప్రకారం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న పసుపుల పెద్ద సాయిలును తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త ఎన్నికలు జరిగే వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పసుపుల పెద్ద సాయిలు జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.