అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Kagar | కేంద్ర ప్రభుత్వం(Central Government) చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు(Maoists) కోలుకోలేపోతున్నారు. కేడర్‌ను కోల్పోతుండడంతో దళాల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపేయాలని మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరోలేఖను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం(Modi Government) దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రావాలన్నారు.
Operation Kagar | మావోల అంతమే లక్ష్యంగా..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టులపై కఠినంగా వ్యవహరిస్తోంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోల అంతమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. 2026 మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పార్లమెంట్లో ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు.
Operation Kagar | అడవులపై పట్టు..
మావోయిస్టులకు గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో పట్టు ఉండేది. అయితే భద్రత బలగాలు ఆపరేషన్ కగార్(Operation Kagar) చేపట్టి దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుంటూ వేల సంఖ్యలో బలగాలు నిత్యం కూంబింగ్(Coombing) చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్యంపై కూడా బలగాలు పట్టు సాధించాయి.
Operation Kagar | కర్రెగుట్టలు స్వాధీనం
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటపూర్ సమీపంలో గల కర్రెగుట్ట(Kareegutta)ల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. మావోలు సైతం కర్రెగుట్టల చుట్టు బాంబులు పెట్టామని, అటువైపు ఎవరు రావొద్దని లేఖ రాశారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయాయి. సుమారు 20 రోజుల పాటు గుట్టల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు(CRPF Soldiers) కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల బంకర్లు, భారీ సొరంగాలను జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మావోలు పెట్టిన మందుపాతర పేలి ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. అనంతరం భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది.
Operation Kagar | మళ్లీ ఎన్కౌంటర్లు..
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు(Security Forces) వెనక్కి వెళ్లాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గడంతో బలగాలు మళ్లీ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో సైతం ఎన్కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. వరుస ఎన్కౌంటర్లతో పాటు పలువురు మావోలు లొంగిపోతుండడంతో మావోయిస్టులు చర్చలకు వస్తామని లేఖలు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.