Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri | పీడీఎస్ బియ్యం పట్టివేత

Kotagiri | పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Kotagiri | కోటగిరి నుంచి హైదరాబాద్​ (Hyderabad)కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సోమవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద బాన్సువాడ ఏఎస్సై సీతారామలక్ష్మి (ASI Seetharamalakshmi), కానిస్టేబుళ్లు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం (PDS Rice)ను గుర్తించారు. బియ్యం రవాణా చేస్తున్న డ్రైవర్ ఎజాజ్​ను అదుపులోకి తీసుకొని నస్రుల్లాబాద్ పోలీసు (Nasrullabad Police)లకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Must Read
Related News