అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: PDS Rice Seize | జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్కేక నిఘా పెట్టారు. పీడీఎస్ బియ్యంను (PDS Rice) సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై కన్నేసి ఉంచారు. ఈ క్రమంలో జక్రాన్‌పల్లిలో మంగళవారం నిలువ ఉంచిన బియ్యంను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.
PDS Rice Seize | పక్కా సమాచారం మేరకు..
పక్కా సమాచారం మేరకు.. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశానుసారం ఏసీపీ మస్తాన్ అలీ (ACP Mastan Ali) ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు జక్రాన్‌పల్లిలో దాడులు నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని పడకల్ గ్రామంలోని ఓ రేకుల గదిలో దాచి ఉంచిన 10 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాక్లూర్‌కు చెందిన మహమ్మద్ మోహిన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చర్యల నిమిత్తం అతడిని జక్రాన్‌పల్లి పోలీసులకు (Jakranpally Police) అప్పజెప్పి బియ్యం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాస్తాన్ అలీ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలించడం నేరమన్నారు. ఎవరైనా బియ్యం అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.