Homeజిల్లాలునిజామాబాద్​PDS rice | భారీగా పీడీఎస్​ బియ్యం పట్టివేత.. అధికారుల పనితీరుపై అనుమానాలు!

PDS rice | భారీగా పీడీఎస్​ బియ్యం పట్టివేత.. అధికారుల పనితీరుపై అనుమానాలు!

PDS rice | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో గురువారం (అక్టోబరు 16) పెద్ద మొత్తంలో పీడీసీ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: PDS rice | ప్రభుత్వ ఉచిత పథకాలు Government free schemes పక్కదారి పడుతున్నాయి. ఇలాంటి స్కీమ్స్ అక్రమార్కులకు వరంగా మారి కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా రేషన్​ బియ్యం ration rice విషయంలో భారీగా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

నిరుపేదలకు చెందాల్సిన పీడీఎస్​ బియ్యం పెద్దల ఇలాకాల్లోకి దారి మళ్లుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్​ జిల్లా Nizamabad district లో ఇలాంటి అక్రమాలు అనేకం చోటుచేసకుంటున్నాయి.

ఇందూరు నగర శివారుల్లోని పలు రైస్​ మిల్లులు rice mills రేషన్​ బియ్యాన్ని మళ్లీ మర పట్టించి, సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీనికితోడు నిజామాబాద్​కు ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రం అయిన మహారాష్ట్రలో పలు లిక్కల్​ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల బియ్యాన్న పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, సదరు లిక్కర్​ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారనే అపవాదు కూడా లేకపోలేదు.

PDS rice | విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్

ఇక విషయానికి వస్తే.. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో గురువారం (అక్టోబరు 16) పెద్ద మొత్తంలో పీడీసీ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​ Vigilance Enforcement అధికారులు పట్టుకున్నారు.

నగరానికి ఆనుకున్న ఉన్న మాక్లూర్​ నుంచి నిజామాబాద్​ శివారులోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తుండగా అధికారులు దాడులు చేపట్టారు. వీరి దాడిలో పీడీఎస్​ బియ్యం అక్రమ తరలింపు బాగోతం వెలుగు చూసింది.

నిందితులు 15 టన్నులకు పైగా పీడీఎస్​ బియ్యం తరలిస్తుండటాన్ని అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో పేదల బియ్యం పెద్దల్లాంటి గద్దల పాలవుతున్నా.. జిల్లా యంత్రాంగంలో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసుల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు “మామూలు”గా తీసుకోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి.