అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nellore Police | ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేసిన లేడీ డాన్ అరుణ (Lady Don Aruna)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కొంతకాలంగా అరుణ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై నెల్లూరు జిల్లాలో పీడీ యాక్ట్ (PD Act) నమోదు అయింది.
కోవూరు మండలం (Kovur Mandal) పెద్ద పడుగుపాడు గ్రామం కేఆర్ఆర్ నగర్‌కు చెందిన అరుణ వైసీపీ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీకాంత్‌తో ఓ హాస్పిటల్లో అరుణ ఉన్న దృశ్యాలు తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అరుణపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీసు స్టేషన్ల (Vedayapalem Police Stations)తో పాటు విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆమె అనేక మందిని మోసం చేసింది. అంతేగాకుండా బాధితులపై బెదిరింపులకు పాల్పడింది. ఈ కేసులో గతంలో ఆమెను అరెస్ట్ చేశారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు.
Nellore Police | కడప సెంట్రల్ జైలుకు..
అరుణ ప్రస్తుతం అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉండగా.. పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail)కు తరలించారు. అలాగే నెల్లూరులోని మరో ఇద్దరు రౌడీషీటర్లు జయప్రకాశ్, షేక్ షాహుల్ హమీద్‌లపైనా పీడీయాక్ట్ పెట్టారు. కాగా రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ పేరు వినిపించింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రీకాంత్‌ను ఆమె జైలు నుంచి బయటకు తెచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అరుణ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం లేడీ డాన్‌పై చర్యలు చేపట్టింది.