అక్షరటుడే, కామారెడ్డి: PD Act | అంతర్రాష్ట్ర పార్థీ దొంగల ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిందితులకు ఉత్తర్వుల కాపీని అందజేశారు.
ముఠా సభ్యులు కృష్ణ బాబు షిండే, నామ్‌దేవ్ అలియాస్ రామ్‌కిషన్ భోస్లే అలియాస్ రామ్‌దాస్, రాథోడ్ అజిత్ రమేశ్ అలియాస్ అజయ్‌పై పీడీ యాక్ట్ అమలు చేశారు. అదే ముఠాకు చెందిన మరో ప్రధాన నిందితుడు భాస్కర్ బాపూరావ్ చవాన్ అలియాస్ భాస్కర్‌దాదా రావ్ చవాన్ సదాశివనగర్ (Sadashivnagar), గాంధారి, తాడ్వాయి, పిట్లం , బీర్కూర్, మద్నూర్ పోలీస్ స్టేషన్లతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో (Nirmal district) మొత్తం 14 దోపిడీ, చోరీ కేసుల్లో నేరాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రస్తుతం అతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో (Nizamabad Central Jail) ఉన్నాడు. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టర్ (Kamareddy Collector) జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైల్లో నిందితులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు. నిందితుల నేరపూరిత చర్యలు సమాజంలో శాంతి-భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నందున, ప్రజల రక్షణ కోసం పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
