Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | వివాహ వేడుకకు హాజరైన పీసీసీ చీఫ్​..

Nizamabad City | వివాహ వేడుకకు హాజరైన పీసీసీ చీఫ్​..

జిల్లా పర్యటనలో భాగంగా పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ శనివారం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. పీడీ అబ్బాపూర్​ రవీందర్​ కుమార్తె దీప్తి, కళ్యాణ్​ల​ వివాహానికి హాజరై వధూవరులను దీవించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar) శనివారం పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ధర్మారం పీహెచ్​ఆర్​ గార్డెన్​లో (PHR Garden) జరిగిన​ ఫిజికల్​ డైరెక్టర్​ అబ్బాపూర్ రవీందర్ కూతురు దీప్తి, కళ్యాణ్​ల వివాహానికి హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించారు.

ఆయన వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), పీసీసీ ప్రధాన కార్యదర్శి రాం భూపాల్, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, శేఖర్ గౌడ్, మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ తదితరులు ఉన్నారు.