ePaper
More
    HomeతెలంగాణCabinet Expansion | ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ.. నేడు పీసీసీ కార్యవర్గం ఖరారు!

    Cabinet Expansion | ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ.. నేడు పీసీసీ కార్యవర్గం ఖరారు!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: cabinet expansion : మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావహులకు మూన్నెళ్లుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఊరిస్తూనే ఉంది. దీనిపై సోమవారం నాడు క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    కాగా, పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. పీసీసీ కార్యవర్గాన్ని(PCC executive committee) మంగళవారం ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఇదే విషయమై ఢిల్లీలో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పార్టీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.

    మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్(CM Revanth), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు​ మహేశ్ కుమార్(PCC chief Mahesh Kumar) వరుసగా పార్టీ అగ్రనేతలతో సమాలోచనలు చేశారు.

    రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రి పదవులకు పోటీ పడుతున్న వారిలో ఎమ్మెల్యేలు పీ సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanti) పేరు సైతం తెరపైకి వచ్చింది. బీసీ సామాజిక వర్గం నుంచి తనకు కేటాయించాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

    ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ప్రధాన మంత్రి మోడీ(Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్(NITI Aayog) మీటింగ్​లో పాల్గొన్నారు. ఆదివారం (May 25) సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన చర్చల్లో పీసీసీ కార్యవర్గం(PCC working committee) కూర్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి వచ్చేశారు. కాగా, రాష్ట్ర కేబినెట్ పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. రాహుల్ గాంధీ ఆమోద ముద్ర వేయాల్సి ఉందని చెబుతున్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...