Congress Nizamabad
Congress Nizamabad | పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు​ రామకృష్ణకు సన్మానం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Congress Nizamabad | పీసీసీ క్రమ శిక్షణ కమిటీ మెంబర్​గా (PCC Disciplinary Committee) సీనియర్​ నాయకుడు రామకృష్ణను (Ramakrishna) ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా నగరంలోని కాంగ్రెస్​ భవన్​లో బుధవారం రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్​ అధిష్టానం తనను గుర్తించి క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ ఇచ్చిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్​టీయూసీ నాయకుడు నాగరాజు, హరిబాబు, రాజేంద్రప్రసాద్​, బంటు బలరాం, నరేందర్​ తదితరులు పాల్గొన్నారు.