ePaper
More
    HomeతెలంగాణPCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్​ను మంగళవారం సిట్ అధికారులు(Sit Officers) రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్​లో సీఎం రేవంత్(CM Revanth) సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు.రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

    PCC Chief | మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ఫోన్లు ట్యాప్

    మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేశ్​ కుమార్​ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud)​ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానం రావడంతో గతంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వేల మంది నాయకుల ఫోన్లను ట్యాప్​ చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​, మంత్రి కేటీఆర్(Minister KTR)​లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులని పేర్కొన్నారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...