అక్షరటుడే, వెబ్‌డెస్క్:PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నేనే పోటీలో ఉంటా అంటూ అజారుద్దీన్(Azharuddin) చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తానే పోటీచేస్తానని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.
తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయానని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఏడాదిన్నరగా నియోజకవర్గంలో కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా.. అజారుద్దీన్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించారు. ఒక అభ్యర్థిని ఫైనల్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చాలా ప్రాసెస్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముందు పీసీసీకి ఆశావహులు దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తులను ఫిల్టర్ చేసి సీఈసీ, సీడబ్ల్యూసీలకు పంపుతామని వివరించారు. అక్కడ వాళ్లు ఒక అభ్యర్థిని ఫైనల్ చేస్తారన్నారు. అప్పటివరకు ఎవరు ఎన్ని మాట్లాడినా అది ఫైనల్ కాదని స్పష్టం చేశారు.