HomeతెలంగాణPCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంగులేటి ఆదివారం మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదల అవుతుందని, మొదట ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున కాంగ్రెస్​ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంతో మహేష్ గౌడ్(PCC Chief Mahesh Goud)​ సీరియస్​ అయినట్లు తెలిసింది. ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కేబినెట్​లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖపై వేరొకరు మాట్లాడడం సరైంది కాదన్నారు. అందులోనూ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించినట్లు సమాచారం. పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరూ ప్రకటనలు చేయొద్దని ఆయన ఆదేశించారు.

Must Read
Related News