HomeతెలంగాణCabinet Expansion | మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్‌

Cabinet Expansion | మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy) ఇంటికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Mahesh Goud)​ వెళ్లారు. మల్​రెడ్డి కొంతకాలంగా మంత్రి పదవి కోసం డిమాండ్​ చేస్తున్నారు.

రంగారెడ్డి(Ranga Reddy), హైదరాబాద్ (Hyderabad)​ జిల్లాల నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదని ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గం అడ్డయితే.. తాను రాజీనామా చేసి ఇతరులను గెలిపిస్తానని గతంలో వ్యాఖ్యానించారు. వారికైనా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. గతంలో ఇదే విషయమై జానారెడ్డి (Janareddy) అధిష్టానానికి లేఖ రాయడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్​ పడిన విషయం తెలిసిందే.

Cabinet Expansion | సామాజిక సమీకరణాలతో..

అయితే తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కాంగ్రెస్ (Congress)​ సామాజిక సమీకరణాలను ప్రాధాన్యంలోకి తీసుకుంది. మాల సామాజికి వర్గానికి చెందిన గడ్డం వివేక్​(చెన్నూర్​), బీసీ ముదిరాజ్​ కులానికి చెందిన వాకిటి శ్రీహరి(మక్తల్​), మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్​కుమార్​(ధర్మపురి)కు పదవులు కేటాయించింది. వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశించిన మల్​రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, సుదర్శన్​రెడ్డికి భంగపాటు ఎదురైంది.

Cabinet Expansion | బుజ్జగింపులు షురూ

తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో మల్​రెడ్డి అలిగారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఆయనను బుజ్జగించేందుకు మల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మంత్రి పదవి దక్కని ఆశావహులను బుజ్జగించేందుకు పీసీసీ చర్యలు చేపట్టింది. వారితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​, కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ మాట్లాడనున్నట్లు తెలిసింది. భవిష్యత్​లో వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.

Must Read
Related News