అక్షరటుడే, డిచ్పల్లి: Dichpally | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లక్కవత్రి నారాయణ కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ( Bomma Mahesh Kumar Goud) పరామర్శించారు.
ఈ మేరకు శనివారం ఆయన మిట్టపల్లిలోని (Mittapally) నారాయణ ఇంటికి వెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. అనంతరం రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు.
ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాటిపల్లి నగేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, శేఖర్ గౌడ్, పొలసాని శ్రీనివాస్, గడీల శ్రీరాములు, రామచందర్ గౌడ్, ముల్లంగి నర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.