HomeతెలంగాణDS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: DS Statue | పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత డి.శ్రీనివాస్(డీఎస్​)​విగ్రహాన్ని నిజామాబాద్​లో కేంద్ర మంత్రి అమిత్​ షా (Union Minister Amit Shah) ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఎంపీ అర్వింద్​ (MP Arvind) తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా.. ప్రథమ వర్ధంతి సందర్భంగా అమిత్​ షాతో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే డీఎస్​ విగ్రహ (DS statue) ఆవిష్కరణపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్​ ​గౌడ్​ (Bomma Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్​లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్​ గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

DS Statue | డీఎస్​ కాంగ్రెస్​ మనిషి

డీఎస్​ కాంగ్రెస్​ మనిషని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ (PCC President Mahesh Goud) అన్నారు. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలను డీఎస్​ వ్యతిరేకంగించారని పేర్కొన్నారు. అలాంటిది ఆయన విగ్రహావిష్కరణకు అమిత్​ షాను పిలవడమేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) చొరవతోనే డీఎస్​ విగ్రహం ఏర్పాటు అయ్యిందన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డిని పిలవకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

డీఎస్​ విగ్రహాన్ని (DS statue) అమిత్​ షా ఆవిష్కరిస్తే ఆయన ఆత్మ బాధ పడుతుందని మహేశ్​ గౌడ్​ వ్యాఖ్యానించారు. డీఎస్​ ఏనాడు బీజేపీ వైపు చూడలేదన్నారు. అలాంటిది ఆయన విగ్రహాన్ని అమిత్​ షాతో ఆవిష్కరింపజేయడం ఏమిటన్నారు.

Must Read
Related News