అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy)పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని అనిరుధ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) ఆగిపోవాలంటే.. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపి వేయాలని ఆయన సూచించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టు, రోడ్డు కాంట్రాక్టర్లలో చంద్రబాబు కోవర్టులే ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కోవర్టులకు నల్లా, కరెంట్ కనెక్షన్ కట్ చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రూపాయి కూడా వారికి వెళ్లకుండా ఆపాలని కోరారు. అప్పుడు వాళ్లే చంద్రబాబు దగ్గరకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ఆపించేస్తారని పేర్కొన్నారు.
అనిరుధ్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ (PCC President Mahesh Goud) స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటామని హెచ్చరించారు. గతంలో సైతం అనిరుధ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా చంద్రబాబు కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.