అక్షరటుడే, ఇందూరు: CM Revanth Reddy | జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని (Chief Minister Revanth Reddy) కలిశారు. ఈ మేరకు మంగళవారం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సీఎంకు వినతిపత్రం అందజేశారు.
CM Revanth Reddy | అర్బన్, బాల్కొండ నియోజకవర్గాల్లో..
నిజామాబాద్ నగరంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని రహత్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ (integrated school), కళాశాల మంజూరు చేయాలని వారు కోరారు. నిజామాబాదు నగరంలో అదనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మరో ఐటీ టవర్, అదే విధనంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరగా పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.